Pradeep Ranganathan : ఒకప్పుడు ధనుష్ సర్ అంటూ రిక్వెస్ట్.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా దిగి భారీ హిట్.. ఇది కదా సక్సెస్ అంటే..

ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన రోజే ధనుష్ దర్శకుడిగా మారి తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాని రిలీజ్ చేసాడు.

Pradeep Ranganathan : ఒకప్పుడు ధనుష్ సర్ అంటూ రిక్వెస్ట్.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా దిగి భారీ హిట్.. ఇది కదా సక్సెస్ అంటే..

Pradeep Ranganathan Gets Success over Dhanush Directorial Film Old Tweet goes Viral

Updated On : February 27, 2025 / 12:07 PM IST

Pradeep Ranganathan : సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు స్టార్స్ అవుతారో ఎవ్వరికి తెలీదు ఒక్క సినిమాతో జీవితాలే మారిపోతాయి. ఎన్నో ఏళ్ళు కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఒక్క సినిమాతో స్టార్స్ అయిపోతారు. ఇప్పుడు ఓ హీరో కూడా అదిరిపోయే సక్సెస్ కొట్టాడు. అతనే ప్రదీప్ రంగనాథన్.

లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయి ఇటీవలే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. అది ఏ రేంజ్ సక్సెస్ అంటే ఒకప్పుడు హీరో ధనుష్ ని నా షార్ట్ ఫిలిం చూడండి అని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసుకున్న ప్రదీప్ ఇప్పుడు ధనుష్ డైరెక్టర్ గా తీసిన సినిమాకు పోటీగా వచ్చి పెద్ద హిట్ కొట్టాడు.

Also Read : Prabhudeva Son : కొడుకుని పరిచయం చేసిన ప్రభుదేవా.. కొడుకు కూడా డ్యాన్సర్.. కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్..

షార్ట్ ఫిలిమ్స్ తో సినిమా కెరీర్ ని మొదలుపెట్టిన ప్రదీప్ రంగనాథన్. తాను తీసిన ఓ షార్ట్ ఫిలిం పెద్ద సక్సెస్ అవ్వడంతో దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా జయం రవి, కాజల్ జంటగా కోమలి అనే సినిమా తీసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయి 2019 లోనే 40 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కోమలి హిట్ అయినా దర్శకుడిగా అవకాశాలు రాకపోవడంతో తనే హీరోగా, దర్శకుడిగా లవ్ టుడే సినిమా 5 కోట్లతో తెరకెక్కిస్తే ఆ సినిమా తెలుగు, తమిళ్ లో పెద్ద హిట్ అయి 50 కోట్లపైనే వసూలు చేసింది.

ఆ ఒక్క సినిమాతో ప్రదీప్ లైఫ్ మారిపోయింది. ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. లవ్ టుడే తర్వాత హీరోగా మూడు సినిమాలకు సైన్ చేసాడు. అందులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇప్పుడు రిలీజయి హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లు వసూలు చేయగా 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన రోజే ధనుష్ దర్శకుడిగా మారి తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాని రిలీజ్ చేసాడు.

Also Read : Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?

ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కూడా బానే ఉన్నా ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మరింత పెద్ద హిట్ అయింది. దీంతో ధనుష్ తో పోటీకి వచ్చి హిట్ కొట్టాడు అని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు. ఈ క్రమంలో 2017లో ప్రదీప్ రంగనాథన్ షేర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో అప్పట్లో తను చేసిన షార్ట్ ఫిలిం షేర్ చేసి.. ధనుష్ సర్ నేను 2D ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్వహించిన మూవీ బఫ్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ విన్నర్ ని. మీరు ఈ సినిమా చూస్తే సంతోషిస్తాను అని రాసుకొచ్చాడు.

ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ట్వీట్ ని ఇప్పుడు బయటకు తీసి.. ఒకప్పుడు ధనుష్ సర్ అంటూ రిక్వెస్ట్ చేసిన ప్రదీప్ 8 ఏళ్ళ తర్వాత ధనుష్ కి పోటీగా సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇది కదా సక్సెస్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు.