Chennai Love Story Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘చెన్నై ల‌వ్‌స్టోరీ’ క‌లెక్ష‌న్ల వ‌ర్షం.. మూడు రోజుల్లో ఎంతంటే? కిర‌ణ్ గ‌ట్టిగానే కొట్టాడుగా!

కిరణ్ అబ్బవరం హీరోగా న‌టించిన చెన్నై ల‌వ్‌స్టోరీ (Chennai Love Story Collections) బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది.

Kiran Abbavaram Chennai Love Story three days Collections

Chennai Love Story Collections : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంట‌గా న‌టించిన చిత్రం చెన్నై ల‌వ్ స్టోరీ. రవి నంబూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. SKN, సాయి రాజేష్, ధీరజ్ లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. ఈ చిత్రంలోని ల‌వ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం గ‌త చిత్రాల కంటే ఎక్కువ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం 40.1 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేర‌కు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Pooja Hegde : స్ట‌న్నింగ్ లుక్‌లో పూజా హెగ్డే.. ఫోటోలు వైర‌ల్..

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి దాదాపు 23 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మూడు రోజుల్లోనే 40 కోట్లు వ‌సూళ్లు చేయగా.. ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోనుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.