Kiran Abbavaram : దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం.. ‘క’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

ఇప్పటికే ‘క’ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు క సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

Kiran Abbavaram KA Movie Release Date Announced

Kiran Abbavaram : ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన కిరణ్ అబ్బవరం త్వరలో తన మొదటి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ‘క’ అనే ఆసక్తికర టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో క సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read : Pawan Kalyan : ముందు రాష్ట్ర భవిష్యత్తు.. ఆ తర్వాతే సినిమాలు.. నాకు ఏ హీరోతోనూ ఇబ్బందులు లేవు..

ఇప్పటికే ‘క’ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు క సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. క సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అంటూ ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ‘క’ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

అయితే దీపావళి బరిలో ఇప్పటికే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, సత్యదేవ్ జీబ్రా సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అమరన్, భగీరా రిలీజ్ కాబోతున్నాయి.