Pawan Kalyan : ముందు రాష్ట్ర భవిష్యత్తు.. ఆ తర్వాతే సినిమాలు.. నాకు ఏ హీరోతోనూ ఇబ్బందులు లేవు..

తాజాగా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Pawan Kalyan : ముందు రాష్ట్ర భవిష్యత్తు.. ఆ తర్వాతే సినిమాలు.. నాకు ఏ హీరోతోనూ ఇబ్బందులు లేవు..

Pawan Kalyan Interesting Comments on Movies and Heros

Updated On : October 14, 2024 / 3:00 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఏపీ ప్రభిత్వంలో కీలక బాద్యతలు నివహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు పవన్. అయితే ఆయన చేతిలో ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో అవి ఎలాగైనా పూర్తి చేస్తానని ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు. దీంతో కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ పవన్ ఆ సినిమాలు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : CM Revanth Reddy : ‘గేమ్ ఛేంజర్’ పాటతో వీడియో షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సొంతూళ్లో దసరా పండగ.. వీడియో అదిరిందిగా..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అభిమానుల కోరిక కూడా నాకు తెలుసు, నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందం ఇస్తుంది. మీ సమస్యల పరిష్కారంతో పాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే, నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా నాకు సినిమాలు ఒక్కటే. తీరిక సమయంలో సినిమాలు చేసి మిమ్మల్ని ఆనందింపచేస్తాను. రాష్ట్రాన్ని బాగుచేసుకొని ఆ తర్వాతే విందులు, వినోదాలు. ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు. రోడ్లు బాగుండాలి, ఆర్ధిక వ్యవస్థ బాగుండాలి. నేను ఏ హీరోతోనూ పోటీ పడను. నాకు ఎవరితోనూ ఎలాంటి ఇబ్బంది లేవు. అందరు హీరోలు బాగుండాలి. కానీ మీ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లి జై కొట్టాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. థియేటర్ల వద్దకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలి అందుకే ముందు అవి పూర్తి చేస్తాను అంటూ మాట్లాడారు.