×
Ad

Kiran Abbavaram : సూపర్ హిట్ ‘క’ సీక్వెల్.. కిరణ్ అబ్బవరం అవుట్.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

 కిరణ్ అబ్బవరం కెరీర్ లో 'క' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. (Kiran Abbavaram)

Kiran Abbavaram

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కెరీర్ లో ‘క’ సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా వచ్చిన క సినిమా 2024 దీపావళికి వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో తెరకెక్కించారు.(Kiran Abbavaram)

ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. క సినిమా చివర్లోనే క సీక్వెల్ అధికారికంగానే అనౌన్స్ చేసారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. క సినిమా నిర్మాత చింతా గోపాల కృష్ణ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో క సినిమా సీక్వెల్ పై మీడియా ప్రతినిధులు అడగ్గా స్పందించారు.

Also Read : Rajamouli : ఆయన మాకేం చెప్పరు.. అసలు అలా ఎవరూ చేయరు.. రాజమౌళిపై మహేష్, ప్రియాంక కామెంట్స్..

నిర్మాత చింతా గోపాల కృష్ణ ‘క’ సినిమా సీక్వెల్ పై స్పందిస్తూ.. క సినిమా సీక్వెల్ 2027 లో ఉంటుంది. దర్శకులు వాళ్ళే. నా నిర్మాణంలోనే ఉంటుంది. హీరో ఎవరు అనేది దర్శకుల ఇష్టం. వేరే వాళ్ళతో తీయొచ్చు. క సినిమా కంటెంట్ బాగుందని అందరూ అన్నారు. ఆ కంటెంట్ నమ్మి నేను దానికి భారీ బడ్జెట్ పెట్టి తీసాను. పర్ఫార్మెన్స్ ల కంటే కూడా సినిమా కంటెంట్ గురించే అందరూ మాట్లాడారు. ప్రస్తుతం క సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే అధికారికంగా ఆ సినిమాని ప్రకటిస్తాము. 2027 జనవరిలో ఆ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. దీంతో క సీక్వెల్ లో కిరణ్ అబ్బవరం ఉండకపోవచ్చు అని, ఆ కథకి కొనసాగింపుగా కాకుండా ఇంకో కథ ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై కిరణ్ అబ్బవరం ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Also Read : Varanasi : వారణాసి రెండు పార్టులు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఊపిరి పీల్చుకున్న మహేష్ ఫ్యాన్స్..