Rajamouli : ఆయన మాకేం చెప్పరు.. అసలు అలా ఎవరూ చేయరు.. రాజమౌళిపై మహేష్, ప్రియాంక కామెంట్స్..
హాలీవుడ్ లో మహేష్, ప్రియాంక వారణాసి గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. (Rajamouli)
Rajamouli
Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా వారణాసి సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. RRR తో హాలీవుడ్ లో వచ్చిన ఫేమ్ తో రాజమౌళి వారణాసి సినిమాని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి భారీ ప్లాన్ చేసి అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు.(Rajamouli)
తాజాగా హాలీవుడ్ లో మహేష్, ప్రియాంక వారణాసి గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Rajashekar : ‘బులెట్ సునీల్’ గ్లింప్స్ అదిరిందిగా.. రాజశేఖర్ కంబ్యాక్ సినిమా గ్యారెంటీ..
ప్రియాంక చోప్రా, మహేష్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి మాకు టెక్నికల్ సంగతులు ఎక్స్ప్లెయిన్ చేయరు. సినిమాలో ఇది స్లో మోషన్ షాట్, ఈ షాట్ ఇలా వస్తుంది, అలా చూపిస్తాను అని చెప్పడు. మాకు ఎక్కువగా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి అని మాత్రమే చెప్తాడు. అతనికి ఏం కావాలో అదే చెప్తాడు. మాతో ఏం చేయించుకోవాలి అనుకుంటాడో రాజమౌళి అదే చెప్తాడు. షాట్ అయ్యాక బాగుంటే నైస్, వెరీ నైస్ అని చెప్తాడు. వెరీ నైస్ చెప్పాడు అంటే అది గ్రేట్ షాట్ అని అర్ధం. మేమెవ్వరం మానిటర్ చెక్ చేయము. సో మాకు ఏం అవుట్ పుట్ వస్తుందో తెలీదు. రాజమౌళి నుంచి మాకు ఎవరికి ఎక్కువ నైస్ లు, వెరీ నైస్ లు వస్తాయి అని లెక్కపెట్టుకునేవాళ్ళం సరదాగా. మహేష్ ఎక్కువ షూట్ చేసాడు కాబట్టి అతనికి ఎక్కువ వెరీ నైస్ లు వచ్చాయి అని అన్నారు.
మహేష్ మాట్లాడుతూ.. రిహార్సిల్స్ కూడా షూట్ చేస్తారు రాజమౌళి. సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకొని మరీ షూట్ చేస్తారు. అందుకే షూటింగ్ లో ఈజీగా ఉంటుంది. ఒక స్టూడియోలో రిహార్సిల్స్ చేసేవాళ్ళం. రాజమౌళి కి ఒక మెథడ్, ప్రాసెస్ ఉంది. మన క్యారెక్టర్, హావభావాలు అన్ని ఇంపార్టెంట్ అవన్నీ రాజమౌళి దగ్గరుండి చూసుకుంటారు. నా నెక్స్ట్ సినిమాకు రిహార్సిల్స్ పెట్టమని అడుగుతాను. అలా ఎవరూ రిహార్సిల్స్ చేయించరు. రిహార్సిల్స్ చేస్తే షూటింగ్ ఈజీగా ఉంటుంది. యాక్షన్స్ సీక్వెన్స్ లో గాయాలు కూడా తగ్గుతాయి అని తెలిపారు. దీంతో రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి మహేష్, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Prithviraj Sukumaran : పృథ్వీ ఈగలకు దండం పెట్టుకున్నాడు.. వారణాసి షూటింగ్లో ఫన్నీ సంగతులు చెప్పిన మహేష్..
