×
Ad

Kiran Abbavaram – Rahasya Gorak : చిరంజీవి పుట్టిన రోజున కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఎక్కడో తెలుసా..?

కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు.

  • Published On : August 20, 2024 / 10:26 AM IST

Kiran Abbavaram Rahasya Gorak Marriage Date and Venue Details Here

Kiran Abbavaram – Rahasya Gorak : హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరి ఆ తర్వాత ప్రేమలో పడి ఐదేళ్లు ప్రేమించుకొని ఇటీవల మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.

కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం పెళ్లి పనులు మొదలయిన ఫొటోలు, కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి డేట్ అధికారికంగా ప్రకటించలేదు. కిరణ్ అబ్బవరం సన్నిహితుల సమాచారం ప్రకారం కిరణ్ – రహస్య పెళ్లి ఆగస్టు 22న ఉండబోతుందని తెలుస్తుంది. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం గమనార్హం.

Also Read : Prabhas Sisters : చెల్లెళ్ళతో ప్రభాస్ రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

అలాగే కిరణ్ – రహస్య పెళ్లి కర్ణాటక జిల్లాలోని కూర్గ్ లో జరగనుందని సమాచారం. రహస్య ఫ్యామిలీకి దగ్గరి బంధువులు అంతా కూర్గ్ వద్దే ఉండటంతో వీరి పెళ్లి కూర్గ్ లోనే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో సినీ ప్రముఖుల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల పలువురు సెలబ్రిటీలు చేస్తున్నట్టు సైలెంట్ గా పెళ్లయ్యాక ఫొటోలు పోస్ట్ చేస్తారేమో ఈ జంట.