Kiran Abbavaram – Rahasya Gorak : పెళ్లికొడుకుగా కిరణ్.. పెళ్లికూతురిగా రహస్య.. రేపే పెళ్లి..

తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు.

Kiran Abbavaram Rahasya Gorak Wedding Works Going Photos goes Viral

Kiran Abbavaram – Rahasya Gorak : హీరో కిరణ్ అబ్బవరం – హీరోయిన్ రహస్య గోరక్ పెళ్లి పనులు మొదలయ్యాయి. మొదటి సినిమాతో పరిచయమైనా వీరిద్దరూ ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. రేపు ఆగస్టు 22న కర్ణాటక కూర్గ్ లో కిరణ్ – రహస్య పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Also Read : Chiranjeevi – Balakrishna : ఏకంగా 11వ సారి చిరంజీవి – బాలకృష్ణ సంక్రాంతి పోటీ.. విశ్వంభర వర్సెస్ NBK 109..?

తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు. ఈ ఫోటోలను రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జరగనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖుల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. రేపు జరగబోయే వీరి పెళ్లి, పెళ్లి ఫోటోల కోసం కిరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు