Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!
రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ‘SR కల్యాణ మండపం’తో మెప్పించి ఇండస్ట్రీలో అందరితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమా అవకాశాలని సాధిస్తున్న కిరణ్ అబ్బవరం..
- Naresh Mannam
- Published On : February 17, 2022 / 06:21 PM IST
Kiran Abbavaram
Kiran Abbavaram:‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ‘SR కల్యాణ మండపం’తో మెప్పించి ఇండస్ట్రీలో అందరితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమా అవకాశాలని సాధిస్తున్న కిరణ్ అబ్బవరం తన తర్వాతి సినిమా ‘సెబాస్టియన్ PC 524’ను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాని ముందుగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఫైనల్ గా ఇప్పుడు మార్చి నెలకు వాయిదా పడింది.
ఫిబ్రవరి తొలి వారంలోనే టీజర్ ద్వారా సినిమాపై ఆసక్తి పెంచిన సెబాస్టియన్ మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి ఓ పాటను విడుదల చేశారు. నీ మాట వింటే రాదా మైమరపే..! నీ పేరు అంటే రాదా మైమరపే.. అంటూ సాగే ఈ పాట వినేందుకు ఆహ్లాదంగా ఉండగా.. టేకింగ్ నీట్ అండ్ క్లాస్ గా ఉంది. హీరో కిరణ్ పోలీస్ గా ఫన్నీగా కనిపిస్తూనే లవ్ ఎమోషన్ చేస్తే.. హీరోయిన్ నమ్రతా దండేకర్ చూసేందుకు క్యూట్ గా ఎక్కడ ఎక్స్ పోజ్ లేకుండా నీట్ గా కనిపిస్తుంది.
బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కించిన సెబాస్టియన్ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే భారీ మొత్తానికి అమ్ముడయినట్లు తెలుస్తోండగా.. ప్రైమ్ షో ఫిల్మ్స్ ఆ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రమోద్, రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో కిరణ్ అబ్బవరం రేచీకటితో బాధపడే పోలీసుగా నటించిన సంగతి తెలిసిందే.
