Suriya : ‘కంగువ’ షూటింగ్ సెట్‌లో గాయపడిన హీరో సూర్య..

'కంగువ' షూటింగ్ సెట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి గాయం అయ్యినట్లు సమాచారం. నిన్న రాత్రి షూటింగ్ చేస్తున్న సమయంలో..

KOllywood Star hero Suriya injured at Kanguva movie sets

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి గాయం అయ్యినట్లు సమాచారం. ఈ హీరో ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాతలు కూడా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాతో సమాధానం చెబుతామంటూ కామెంట్స్ చేస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది.

ఇక సాధారణంగా తన సినిమాలో కోసం ఎంతో కష్టపడే సూర్య.. ఈ మూవీ కోసం భారీగా కండలు పెంచి ఒక యుద్ధవీరుడిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ లో సూర్యకి గాయం అయ్యినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి షూటింగ్ చేస్తున్న సమయంలో పైన ఉన్న ఒక కెమెరా జాయింట్ కట్ అయ్యి సూర్య మీద వచ్చి పడిందట. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి చిన్న గాయం అయ్యినట్లు సమాచారం.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో, ఫోటో లీక్.. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్..

అయితే భయపడాల్సిన గాయం ఏమి కాదని, సూర్య బాగానే ఉన్నారని చెబుతున్నారు. ఎందుకన్నా మంచిందని సూర్యకి కొంచెం రెస్ట్ ఇస్తూ నేడు షూటింగ్ ని క్యాన్సిల్ చేశారట డైరెక్టర్. కాగా ఈ సినిమాలో సూర్య మొత్తం ఆరు పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మొత్తం 36 భాషల్లో రిలీజ్ కాబోతుందట. 3D, ఐమాక్స్ ఫార్మేట్స్ లో ఈ సినిమా 2024 మధ్యలో రిలీజ్ కి సిద్దమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు