Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో, ఫోటో లీక్.. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్..

'గేమ్ ఛేంజర్' మూవీ సెట్స్ నుంచి కొత్త వీడియో, ఫోటో లీక్. ఒక్క సినిమాలో రామ్ చరణ్ ఇన్ని వేరియేషన్స్..

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో, ఫోటో లీక్.. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్..

Ram Charan Photo leak from Game Changer Sets gone viral

Updated On : November 23, 2023 / 2:15 PM IST

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. శంకర్, కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ ని కూడా చేస్తుండడంతో గేమ్ ఛేంజర్ లేటు అవుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ మైసూర్ లో మొదలైంది. అక్కడ రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ సెట్స్ నుంచి ఫోటో, వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటో, వీడియోల్లో రామ్ చరణ్ సూటు, బూటు వేసుకొని క్లీన్ షేవ్ తో జెంటిల్‌మెన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. IAS పాత్రలో కూడా కనిపించబోతున్నారని ఎప్పుడో నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గెటప్ చూస్తుంటే.. ఆ పాత్రకి సంబంధించిందే అనిపిస్తుంది. కాగా ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఇప్పటికే చాలా గెటప్స్ వేస్తూ కనిపించారు. ఒకసారి స్టైలిష్ హెయిర్ కట్, డ్రెస్సింగ్ స్టైల్ తో యూత్ ఐకాన్ లా కనిపిస్తే, మరోసారి పల్లెటూరి వ్యక్తిలా తెల్ల షర్ట్, పంచ్ తో కనిపించారు.

అలాగే ఒకసారి కళ్ళకి కాటుకతో, మరోసారి మరోలా.. ఇలా గేమ్ ఛేంజర్ సెట్స్ లో కనిపించిన ప్రతిసారి ఒక కొత్త లుక్ లో కనిపిస్తూ అదరగొడుతున్నారు. ఇక ఈ ఫొటోలన్నీ చూసిన అభిమానులు.. అసలు రామ్ చరణ్ ఈ సినిమాల్లో ఎన్ని లుక్స్ లో కనిపించబోతున్నారని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్.. తండ్రి పాత్రలో రాజకీయనాయకుడిగా, కొడుకు పాత్రలో IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ కొత్త షెడ్యూల్ కంటిన్యూగా దాదాపు 20 రోజులు పాటు జరగనుందని సమాచారం.

Also read : Animal Trailer : రణబీర్ కపూర్ ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది..

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి రిలీజ్ కావాల్సిన ‘జరగండి’ సాంగ్ పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి రావాల్సిన ఈ సాంగ్ రిలీజ్ అవ్వలేదు. మ్యూజిక్ డాక్యుమెంటేషన్ వలన ఈ రిలీజ్ పోస్టుపోన్ అయ్యినట్లు నిర్మాతలు తెలియజేశారు. అయితే ఈ సాంగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మోగించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారట.