Anasuya: కోట శ్రీనివాసరావుపై అనసూయ ఆగ్రహం.. వారిని ప్రశ్నించరా?
సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు తనపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నటి, యాంకర్ అనసూయ.
- vamsi
- Published On : October 19, 2021 / 07:00 AM IST
Anasuya
Anasuya: సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు తనపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నటి, యాంకర్ అనసూయ. అనసూయ మంచి నటి, అందంగా ఉంటుందనీ, కానీ వస్త్రధారణ తనకు నచ్చదన్నారు. ఇదే విషయమై పేరు చెప్పకుండా సీనియర్ నటులు అంటూ.. అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. అది వారి వ్యక్తిగతమని, దుస్తులపై కామెంట్ చెయ్యడం సరికాదని అన్నారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. ‘నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్లని ఇప్పుడే చూశాను. అపార అనుభవం ఉన్న సీనియర్ నటుడు అలా మాట్లాడం బాధగా అనిపిస్తుంది. దుస్తులు ధరించే తీరు ఒక్కక్కరిది ఒక్కోలా ఉంటుంది. అది వారి వ్యక్తిగతం. ఒక్కోసారి వృత్తిపరంగానూ రకరకాల బట్టలు వేసుకోవల్సి వస్తుంది.
అయితే, సోషల్ మీడియా అనవసర విషయాలను చాలా ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటుంది. అదే మీడియా ఆ సీనియర్ నటుడు రోజూ మద్యం సేవిస్తారని, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని, ఆన్‌స్ర్కీన్ మహిళల్ని కించపరిచే విధంగా పవర్తిస్తారని చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం!
పెళ్లై పిల్లలున్న స్టార్‌లు హీరోయిన్లతో ఆన్‌స్ర్కీన్ రొమాన్స్ చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు ఎందుకు? చొక్కా లేకుండా శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు? పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలున్నా కూడా చేసే పనిలో సక్సెస్ కోసం కష్టపడుతున్న నాలాంటి వారిపై ఎందుకు ఇటువంటి కామెంట్స్’’ అంటూ రాసుకొచ్చారు.
మీ ఒపీనియన్‌ని పబ్లిక్‌గా ఎదుటివారు బాధపడుతారు అని కూడా లేకుండా ఎలా చెబుతారు? పక్కవారిపై కామెంట్స్ చేయకుండా మీ పని మీరు చూసుకోండి.. వీలైతే, మంచిగా ఎవరికైనా స్పూర్తిని ఇచ్చే మాటలు మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
