‘రూలర్’ – బాలయ్య ఫ్యాన్సా మజాకా!

‘రూలర్’ - కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్ వద్ద బాలయ్య అభిమానుల హంగామా..

  • Publish Date - December 16, 2019 / 01:22 PM IST

‘రూలర్’ – కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్ వద్ద బాలయ్య అభిమానుల హంగామా..

నటసింహా నందమూరి బాలకృష్ణ మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ‘రూలర్’ గా సందడి చేయనున్నాడు. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్థాయిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్ వద్ద ‘రూలర్’ పోస్టర్ పడింది.

Read Also : ‘రూలర్’ సెన్సార్ పూర్తి – ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

‘కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ’.. ‘ఆహా బాలయ్య.. ఓహో బాలయ్య’.. ‘KPHB గడ్డా.. బాలయ్య బాబు అడ్డా’.. ఈ స్లోగన్స్ వినగానే ఠక్కున గుర్తొచ్చేది కూకట్‌పల్లి నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు..

కెపిహెచ్‌బి ప్రాంతానికి చెందిన కర్నాటి కొండలరావు (కేకేఆర్ చౌదరి), విక్రమ్ సింహా, పవన్ మర్ని, పొట్లూరి రామకృష్ణ, ఖాదర్, షేక్ సిరాజ్ తదితరులు ‘రూలర్’ పోస్టర్‌కి పూలదండ వేసి, బొట్టు పెట్టారు. డిసెంబర్ 20వ తేదీ తమ అభిమాన నటుడు బాలయ్య బాబుతో కలిసి ‘రూలర్’ చిత్రాన్ని చూడబోతున్నామని ఆనందంగా తెలిపారు.