‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫస్ట్‌లుక్ రిలీజ్..
రానా దగ్గుబాటి సమర్పణలో, సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
‘క్షణం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్ని హీరోయిన్స్‌గా నటించారు. పోస్టర్‌లో ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు సిద్ధు.
నిజంగా వచ్చిన రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నారు. మూడేళ్ల తర్వాత రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రాబోతున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.