×
Ad

Mahesh Babu – Krishna Vamsi : ఇది కరెక్ట్ కాదు.. దయచేసి అలా చేయకండి.. మహేష్ బాబు ఫ్యాన్స్ పై కృష్ణవంశీ ట్వీట్..

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ క్లాసిక్ హిట్ సినిమా మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Published On : August 11, 2024 / 09:37 AM IST

Krishna Vamsi Serious Tweet on Mahesh Babu Fans Regarding Murari Re Release

Mahesh Babu – Krishna Vamsi : ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ క్లాసిక్ హిట్ సినిమా మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని రీ రిలీజ్ ల్లాగే ఈ సినిమాకు కూడా ఫ్యాన్స్ సందడి చేసారు. చాలా మంది అభిమానులు థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసారు. అయితే రీ రిలీజ్ సినిమాల్లో థియేటర్స్ లో ఫ్యాన్స్ తమ హీరోలు, లేదా ఆ సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ ని తెర ముందు రీ క్రియేట్ చేస్తారు.

ఈ క్రమంలో మురారి సినిమాలో ఉన్న సూపర్ హిట్ పెళ్లి సాంగ్ ని ఓ జంట రీ క్రియేట్ చేసింది. ఓ థియేటర్ లో మురారి సినిమాలో ‘అలనాటి రామచంద్రుడు..’ పెళ్లి సాంగ్ వస్తున్న సమయంలో ఓ జంట థియేటర్లోనే పెళ్లి చేసుకుంది. అబ్బాయి అమ్మాయి మెడలో థియేటర్లోనే తాళి కట్టగా చుట్టూ ఉన్న వాళ్ళు అక్షంతలు వేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Naga Chaitanya – Samantha : సోషల్ మీడియాలో సమంతతో ఉన్న ఆ ఫొటో డిలీట్ చేయమని.. నాగచైతన్యపై ఫ్యాన్స్ ఫైర్..

అయితే ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్ సూపర్ అంటూ, మహేష్ ఫ్యాన్స్ అంటే ఈ రేంజ్ ఉంటది అంటూ పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే చాలా మంది పెళ్లిని ఇలా అపహాస్యం చేస్తున్నారని, అభిమానం ఉండొచ్చు కానీ ఇలా పిచ్చి ఉండకూడదని, వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే ఏమంటారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేసి కృష్ణవంశీని ట్యాగ్ చేసి ఇది చూసారా థియేటర్లో పెళ్లి చేసుకున్నారు అని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఈ వీడియో చూసిన కృష్ణవంశీ దీనికి రిప్లై ఇస్తూ.. ఇది కరెక్ట్ కాదు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయడం, అవమానించడం చేయకండి ప్లీజ్ అని పోస్ట్ చేసాడు. దీంతో కృష్ణవంశీ ట్వీట్ వైరల్ గా మారడంతో పలువురు కృష్ణవంశీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆ జంటకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, వాళ్ళు సరదాగా మహేష్ ఫ్యాన్స్ కావడంతో సీన్ రీ క్రియేషన్ చేసారని కామెంట్స్ చేసారు. ఏదేమైనా సినిమాల రీ రిలీజ్ ల వల్ల ఫ్యాన్స్ చేసే కొన్ని పనులు వైరల్ అవుతున్నాయి.