కూకట్‌పల్లి నందమూరి అభిమానులు ‘రూలర్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు..
‘కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ’.. ‘ఆహా బాలయ్య.. ఓహో బాలయ్య’.. KPHB గడ్డా.. బాలయ్య బాబు అడ్డా’.. ఈ స్లోగన్స్ వినగానే ఠక్కున గుర్తొచ్చేది కూకట్‌పల్లి నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు.. కెపిహెచ్‌బి ప్రాంతానికి చెందిన అన్నగారి అభిమానులు ‘ఎన్టీఆర్ మంత్లీ మీట్’ పేరిట అట్లూరి దీపక్ చౌదరి గారి ఆధ్వర్వంలో ప్రతీ నెలా మొదటి ఆదివారం అన్నగారి విగ్రహం వద్ద కలుస్తుంటారు.
డిసెంబర్ 1 ఫస్ట్ సండే పైగా బాలయ్య ‘రూలర్’ సినిమాలోని ‘అడుగడుగో యాక్షన్ హీరో’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలయ్య వీరాభిమానులు, కర్నాటి కొండలరావు (కేకేఆర్), పవన్ మార్ని, విక్రమ్ సింహా, పొట్లూరి రామకృష్ణ, పొట్లూరి రాజేష్ (పొట్లూరి బ్రదర్స్)
మరికొందరు అభిమానులతో కలిసి ‘రూలర్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. కొద్దిసేపు ‘జై బాలయ్య’ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. డిసెంబర్ 20న ‘రూలర్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్..