Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఫిబ్రవరి 26న గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విజయ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిందని ఓ లేడీ అభిమాని ఎమోషనల్ అవుతున్న వీడియో వైరల్ గా మారింది. విజయ్ – రష్మిక పెళ్లి ఫోటో చూస్తూ లేడీ అభిమాని ఎమోషనల్ అవుతూ ఏడ్చింది. తన దగ్గర దాచుకున్న విజయ్ ఫోటోలు, విజయ్ సినిమాల పేపర్ కటింగ్స్ అన్ని చూపించింది.
తను ఎంతో ఇష్టపడ్డ హీరో పెళ్లి చేసుకోవడంతో ఎమోషనల్ అవుతన్న ఈ లేడీ అభిమాని వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..
😥😳😀
— Suresh PRO (@SureshPRO_) February 27, 2026