Lafoot Gang : ‘లఫూట్ గ్యాంగ్’ కొత్త సినిమా ఓపెనింగ్.. 1990 బ్యాక్ డ్రాప్ హాస్టల్ కథతో..

హైదరాబాదు రామానాయుడు స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయింది. (Lafoot Gang)

  • Published on- May 27, 2026 / 05:21 PM IST

Lafoot Gang

Lafoot Gang : ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాణంలో అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లఫూట్ గ్యాంగ్. చైల్డ్ ఆర్టిస్టులుగా ఫేమ్ తెచ్చుకున్న రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్.. లు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాదు రామానాయుడు స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమా ఓపెనింగ్ కి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బివిఎస్ రవి, రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, అలీ, రాహుల్ విజయ్, నటి దీప్శిక, అర్చన అయ్యర్, దర్శక నిర్మాత అనిల్ కడియాల.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు. అలీ క్లాప్ కొట్టగా, దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజ్ తరుణ్, ఆకాష్ పూరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు.

Also Read : Pawan Kalyan : పైరసీ పై ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్.. అమిత్ షాతో మీటింగ్.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

ఈ సినిమాకు వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ఆర్ ధృవన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. సినిమా ఓపెనింగ్ అనంతరం దర్శకుడు అనురాగ్ మాట్లాడుతూ… 1990ల నాటి రోజులలో జరిగే ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ఇప్పటికీ ఆ టైం పీరియడ్ లో చాలా కథలు వచ్చినప్పటికీ ఈ కథ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నారు.

నిర్మాత కొండాపూర్ లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడుతూ… 1990ల నాటి ఒక హాస్టల్ లో జరిగే కథగా ఈ సినిమా ఉండనుంది. అల్లరి చిల్లరిగా ఉండే ఒక యువకుల గ్యాంగ్ హాస్టల్లో ఎలా ఉంటారు, వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనం ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేస్తామని తెలిపారు.