Dheera Trailer : ‘ధీర’ ట్రైలర్ చూశారా? 25 లక్షల నుంచి 2500 కోట్ల వరకు జర్నీ..
ధీర సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ధీర ట్రైలర్ విడుదల చేశారు.
- Saketh U
- Published On : January 27, 2024 / 09:08 PM IST
Laksh Chadalavada Dheera Movie Trailer Released
Dheera Trailer : ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు, యువ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada)చిన్నప్పుడే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మెప్పించిన లక్ష్ త్వరలో ‘ధీర’ సినిమాతో రాబోతున్నాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మాణంలో ఈ ధీర సినిమా తెరకెక్కుతుంది.
ధీరలో సోనియా బన్సల్, నేహా పతన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసిన ధీర ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ధీర సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ధీర ట్రైలర్ విడుదల చేశారు.
Also Read : Trivikram : గడ్డం తీసేసిన త్రివిక్రమ్.. గురూజీ కొత్త లుక్ చూశారా?
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు అది వెరీ డేంజరస్.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలై ఒక పని కోసం హీరో కావల్సి వస్తే అన్నట్టు ట్రైలర్ చూపించి ఆ తర్వాత రొమాంటిక్ యాంగిల్స్ కూడా చూపించారు. చివర్లో 25 లక్షలతో మొదలైన నా జర్నీ 2500 కోట్లకు చేరింది అనే డైలాగ్ తో ట్రైలర్ ముగించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం, డబ్బు చుట్టూ పరిగెత్తే సినిమా అని తెలుస్తుంది. మరి ధీర సినిమా థియేటర్స్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
https://www.youtube.com/watch?v=RyacXKxZPLw
