Trivikram : గడ్డం తీసేసిన త్రివిక్రమ్.. గురూజీ కొత్త లుక్ చూశారా?
త్రివిక్రమ్ గడ్డం లేకుండా ఇటీవల అస్సలు కనపడలేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పబ్లిక్ కి కనిపించారు త్రివిక్రమ్.

Director Trivikram Srinivas Met Megastar Chiranjeevi Trivikram Beard less Look goes Viral
Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే సంక్రాంతికి మహేష్ బాబుతో(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా తీసుకొచ్చి భారీ విజయం సాధించాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే త్రివిక్రమ్ అంటే గడ్డం కచ్చితంగా ఉండాల్సిందే. త్రివిక్రమ్ గడ్డం లేకుండా ఇటీవల అస్సలు కనపడలేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పబ్లిక్ కి కనిపించారు త్రివిక్రమ్.
ఈ ఈవెంట్లో త్రివిక్రమ్ కి ఫుల్ వైట్ గడ్డం ఉంది. అయినా స్టైలిష్ గా ఉన్నారంటూ కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ గడ్డం లేని ఫోటో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read : Sandeep Vanga – Chiranjeevi : మెగాస్టార్‌తో యానిమల్ సందీప్ వంగ.. ఆ డైరెక్టర్ కూడా.. సినిమా ప్లాన్ చేస్తారా?
అయితే ఈ ఫొటోల్లో చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం లేకుండా కనపడటంతో ఇవి వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ గడ్డం లేకుండా ఇలా ఉంటాడా అనుకుంటున్నారు. కానీ గడ్డం ఉంటేనే స్టైలిష్ లుక్స్ లో ఉంటాడు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్ మొదటిసారి కనపడటం మళ్ళీ ఇదే. మహేష్ బాబు ఇచ్చిన గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ కి కూడా త్రివిక్రమ్ హాజరవ్వలేదు.
A moment of celebration and admiration as our producer S. Radhakrishna (chinababu) garu and our darling director #Trivikram garu met Shri. Megastar @KChiruTweets garu and extended their Heartfelt congratulations on the well-deserved #PadmaVibhushan recognition, bringing immense… pic.twitter.com/krGxOcQh4F
— Haarika & Hassine Creations (@haarikahassine) January 27, 2024