Salman Khan : సల్మాన్ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్..
తమ అభిమాన హీరోకి విషెస్ చెప్పడానికి, అభిమాన హీరోని చూడటానికి సల్మాన్ ఇంటివద్ద భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. రోడ్డుపై భారీగా జనాలు ఉండటంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో.........
- Saketh U
- Published On : December 28, 2022 / 09:40 AM IST
Lathi Charge on Salman Khan fans
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మంగళవారం నాడు తన 57 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ సినీ ప్రముఖులకు స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాడు సల్మాన్. ఇక ప్రముఖులు, సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ పుట్టిన రోజు కావడంతో ముంబై బాంద్రాలో అయన నివాసం వద్ద అభిమానులు భారీగా చేరుకున్నారు.
తమ అభిమాన హీరోకి విషెస్ చెప్పడానికి, అభిమాన హీరోని చూడటానికి సల్మాన్ ఇంటివద్ద భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. రోడ్డుపై భారీగా జనాలు ఉండటంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో సల్మాన్ తన ఇంటి మీదకి వచ్చి అభిమానులకి కనిపించడంతో అభిమానులంతా ముందుకి వచ్చి హంగామా చేశారు.
Chiranjeevi : పవన్‌కి ఖాళీ ఉండాలిగా.. పవన్ తో సినిమాపై మరోసారి చిరంజీవి వ్యాఖ్యలు..
పోలీసులు చెప్పినా వినకుండా సల్మాన్ అభిమానులు రోడ్డుపై రచ్చ చేస్తుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. సల్మాన్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో అందరూ పరిగెత్తారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా వినలేదని, వారిని అదుపుచేయడానికే లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
#SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House #Bandra @MumbaiPolice @DGPMaharashtra pic.twitter.com/dHHQBK4pR3
— Indrajeet chaubey (@indrajeet8080) December 27, 2022
