321 Movie : 321 సినిమా నుంచి మెలోడీ సాంగ్ విన్నారా.. ప్యారడైజ్ జూనియర్ సమ్మక్క కొత్త సినిమా..

మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి.. (321 Movie)

  • Published on- September 27, 2026 / 01:49 PM IST

321 Movie

321 Movie : నాని ది ప్యారడైజ్ సినిమాలో జూనియర్ సమ్మక్క పాత్రలో నటి లావణ్య అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తాజాగా లావణ్య ఓ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మోహిత్, లావణ్య జంటగా తెరకెక్కిన సినిమా ‘321’. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్ అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి నిర్మాణంలో శాంతి కుమార్ చిలుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేసారు.

Also Read : Sravanthi Chokarapu : ఎరుపు చీరలో యాంకర్ స్రవంతి అందాల మెరుపులు.. ఫొటోలు..

‘నను తాకిన..’ అంటూ మెలోడీ పాటగా సాగింది. కాల్విన్ జాయ్ సంగీత దర్శకత్వంలో శాంతి కుమార్ ఈ పాటను రాయగా సాయి చరణ్, హరిణి పాడారు. ఈ పాటకు మెహర్ బాబా మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ప్రేమ నేపథ్యంలో ఈ మెలోడీ సాంగ్ సాగింది. ఈ సినిమాలో లక్ష్మీ వెన్నెల, యామిని, శ్రీనివాస్ భోగిరెడ్డి, ప్రభావతి, మాధవి, విద్యా సాగర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి..