Lavanya Tripathi : ఓ పక్క ప్రగ్నెంట్.. మరో పక్క గాయం, మైగ్రేన్.. సతీ లీలావతి కోసం మెగా కోడలు కష్టాలు..

ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి నేడు మీడియాతో మాట్లాడారు. (Lavanya Tripathi)

  • Published on- May 6, 2026 / 03:04 PM IST

Lavanya Tripathi

Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో పెళ్లి, బాబు పుట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి మొదటి సారి సతీ లీలావతి సినిమాతో రాబోతుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో తాతినేని స‌త్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి నేడు మీడియాతో మాట్లాడారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం, మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ చేశాను. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. అప్పుడే ఒక గాయం కూడా అయింది. అయినా ఈ సినిమా చేశాను. ప్రతీ రోజూ షూటింగ్ అయ్యాక హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ మూవీ కోసం కొంచెం వెయిట్ కూడా తగ్గాను. నేను ప్రెగ్నెంట్ అయినా స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో కొన్ని మార్పులు చేశారు. హీరోని కాలితో గట్టిగా కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. అప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను. ఈ సినిమా సమయంలోనే మైగ్రేన్ కూడా వచ్చింది. ఆ మైగ్రేన్ తో డ్యాన్స్ కూడా చేశాను సినిమాలో. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం సినిమా చేయను అని సినిమా కోసం తను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చింది.

Also Read : Peddi : ఏంటి.. ‘పెద్ది’ ఎమోషనల్ సినిమానా?.. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

ఇక ఈ సతీ లీలావతి సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌, ఓ మంచి మెసెజ్ కూడా ఉంది. సతీ లీలావతిలో చూపించినట్టు రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ జంటకు రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. సీనియర్ యాక్టర్ నరేష్ గారితో తండ్రి ఎమోషన్ ఉంటుంది. ఈ సతీ లీలావతి సినిమా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది అని తెలిపింది.

భవిష్యత్తులో సినిమాలు చేయడంపై స్పందిస్తూ.. ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. నా కొడుకు నడిచే సమయం వచ్చాక అపుడు సినిమాలు ఆలోచిస్తాను. కానీ కచ్చితంగా భవిష్యత్తులో సినిమాలు చేస్తాను. వరుణ్‌తో కలిసి మళ్ళీ నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైన కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలి. నేను హారర్ సినిమాలు చేయలేదు, నాకు హారర్ సినిమాలు ఇష్టం. భవిష్యత్తులో హారర్ సినిమా అయితే చేస్తాను అని తెలిపింది.

Also See : Lavanya Tripathi: ‘సతీ లీలావతి’ మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్