Peddi : ఏంటి.. ‘పెద్ది’ ఎమోషనల్ సినిమానా?.. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (Peddi)
Peddi
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. జూన్ 4న పెద్ది సినిమా భారీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే పెద్ది సినిమాలో కుస్తీ పోటీలు, క్రికెట్ పోటీలు ఉండబోతున్నాయని, రామ్ చరణ్ కుస్తీ వీరుడిగా, క్రికెట్ ఆటగాడిగా కనిపించబోతున్నాడని వచ్చిన గ్లింప్స్ తో తెలుస్తుంది. బుచ్చిబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. దీంతో ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Peddi : ఏకంగా 24 సెట్స్, 70 సెటింగ్స్.. పెద్ది కోసం ఏం చేసారంటే.. రివీల్ చేసిన ఆర్ట్ డైరెక్టర్..
పెద్ది సినిమా గురించి అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. బుచ్చిబాబు నాకు కథ మొత్తం చెప్పాడు. కథ చెప్పిన తర్వాత అరగంట వరకు నేను మాములు మనిషి కాలేకపోయాను. షాక్ లో ఉండిపోయాను ఆ కథ విని. అంత కొత్తగా అంత బాగుంటుంది. పెద్ది సినిమా చివరి అరగంట మాత్రం అదిరిపోతుంది. సినిమా చూసేటప్పుడు కన్నీళ్లు రావడం ఖాయం. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఏడుస్తారు అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
అవినాష్ కొల్ల చెప్పిన దాని ప్రకారం పెద్ది స్పోర్ట్స్ యాక్షన్ అనుకుంటే స్పోర్ట్స్ ఎమోషనల్ స్టోరీ అని తెలుస్తుంది. రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించబోతున్నాడని తెలుస్తుంది.
