Peddi : ఏకంగా 24 సెట్స్, 70 సెటింగ్స్.. పెద్ది కోసం ఏం చేసారంటే.. రివీల్ చేసిన ఆర్ట్ డైరెక్టర్..
పెద్ది సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. (Peddi)
Peddi
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు గ్లింప్స్, రెండు సాంగ్స్ మాత్రమే వచ్చినా హైప్ మాత్రం భారీగా ఉంది. ఇందులో చరణ్ కుస్తీ, క్రికెట్ రెండూ ఆడబోతున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Allu Arjun : జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్?
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. పెద్ది సినిమా 1970 – 80 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. విజయనగరం, ఆ చుట్టు పక్కల ఈ కథ జరుగుతుంది. పెద్ది సినిమా కోసం ఆల్మోస్ట్ 24 సెట్స్ వేసాము. అవి కాకుండా ఉన్నవాటిని పెద్దికి తగ్గట్టు 70 సెటప్స్ మార్చాము. ఐటెం సాంగ్ కోసం సపరేట్ సెట్ వేసాము. కుస్తీ కోసం ఓ అండర్ గ్రౌండ్ లో సెట్ వేసాము. ట్రైన్ సెటప్ ఒకటి ఉంటుంది.
కుస్తీ, క్రికెట్ లో వాడే వస్తువుల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాము. విజయనగరం గంటస్తంభం, మెయిన్ రోడ్ ఏరియా అంతా సెట్ వేసాము. 3D లో డిజైన్ చేసి మరీ ఆ సెట్ వేసాము. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఆ సెట్ ని ఉంచాము. ఎండా, వాన అన్నిటికి తట్టుకునేలా ఆ సెట్ వేసాము. పొలాల్లో, చెరుకు తోటల్లో షూటింగ్స్ జరిగాయి. ఇండోర్ సెట్స్ ఏమి లేవు. అన్ని బయటే, న్యాచురల్ లైటింగ్ కోసం ఓపెన్ ఏరియాలలోనే సెట్స్ వేసాము. అరకు లాంటి సెటప్ కావాల్సి వస్తే హైదరాబాద్ లోని ఓ బూత్ బంగ్లాలో డిజైన్ చేసాము. అసలు అది కనిపెట్టలేరు కూడా అని తెలిపారు. దీంతో పెద్ది సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడిందని తెలుస్తుంది.
Also Read : Rajinikanth : ఛ.. రజినీకాంత్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదే జరిగుంటే సీఎం అయ్యేవారా?
