Allu Arjun : జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్?
అల్లుఅర్జున్ (Allu Arjun) తన అభిమానులను ఒక్కటి చేసి దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారట
Gossip Garage Allu Arjun Fans Association at the national level
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన అభిమానులను ఒక్కటి చేసి దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారట. ప్రతి రాష్ట్రంలోనూ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, వాటిని ఒకే గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. త్వరలో అల్లుఅర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేయడమే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ టార్గెట్ అంటున్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి అభిమానుల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించారట. అల్లుఅర్జున్ తీసుకున్న ఈ స్టెప్ వెనుక ఫ్యూచర్ ప్లానింగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. తన సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోట్ చేయడమే బన్నీ వ్యూహమంటున్నారు.
ఇప్పటిప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌గా మల్చుకోవాలనేది ప్లాన్ అంటున్నారు. ఇప్పటికిప్పుడు అయితే అట్లీ-అల్లుఅర్జున్ కాంబోలో వస్తున్న పిక్చర్‌కు వరల్డ్ రికార్డులు సృష్టించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. థియేటర్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ప్రతి రాష్ట్రంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ఫ్యాన్ మీట్స్ పెట్టి..దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకోవాలని భావిస్తున్నారట.
అట్లీ కమర్షియల్ మాస్ స్టైల్‌తో అల్లుఅర్జున్ స్టార్ పవర్ కలిసినప్పుడు ఈ మూవీ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ అసోసియేషన్ ఏర్పాటు అల్లుఅర్జున్ను మరింత బలమైన పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారట.
