Lavanya Tripathi : సెకండ్ ప్రగ్నెన్సీ పై మెగా కోడలు కామెంట్స్ వైరల్..
గత సంవత్సరం సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చింది. (Lavanya Tripathi)
- Saketh U
- Published On : February 21, 2026 / 10:55 AM IST
Lavanya Tripathi
Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా కోడలు అయింది. గత సంవత్సరం సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చింది. వరుణ్ – లావణ్య కొడుకుకి వాయువు తేజ్ కొణిదల అనే పేరు పెట్టారు. వాయువ్ రాకతో మెగా ఫ్యామిలిలో సంతోషం నెలకొంది.(Lavanya Tripathi)
అయితే లావణ్య ప్రగ్నెన్సీ తో ఉన్నప్పుడే సతీ లీలావతి సినిమా షూటింగ్ చేసింది. ఈ సినిమా మార్చ్ 6న రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. యాంకర్ సుమ తో చేసిన ఇంటర్వ్యూలో లావణ్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Also Read : Lavanya Tripathi : డాక్టర్ చెప్పినా కూడా ప్రగ్నెన్సీలో షూటింగ్ చేసిన మెగా కోడలు.. పాపం వాంతులు, మైగ్రేన్..
లావణ్య ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు షూటింగ్ చేస్తూ పడ్డ హెల్త్ ఇష్యూస్ గురించి తెలిపి.. ఇప్పుడు బాబుతో హ్యాపీగా ఉన్నాను. సెకండ్ బేబీ కూడా ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పగలను అని తెలిపింది. అలాగే మొదటి ప్రగ్నెన్సీలో ఈ సినిమా చేస్తే సెకండ్ ప్రగ్నెన్సీలో పార్ట్ 2 చేస్తానేమో అని నవ్వుతూ సరదాగా కామెంట్స్ చేసింది. దీంతో లావణ్య – వరుణ్ భవిష్యత్తులో సెకండ్ ప్రగ్నెన్సీకి కూడా ప్లాన్ చేస్తారని క్లారిటీ ఇచ్చేసింది.
