Sathi Leelavathi Trailer: ఆకట్టుకుంటున్న లావణ్య సతీ లీలావతి ట్రైలర్.. ఇంతకీ అల్లుడెక్కడ?
Lavanya Tripathi Sathi Leelavathi Trailer: మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సతీ లీలావతి ట్రైలర్‌ను (Sathileelavathi Trailer) విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 2, 2026 / 07:15 PM IST
Lavanya Tripathi Sathileelavathi Trailer out now
Sathi Leelavathi Trailer : మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘SMS’ చిత్ర దర్శకుడు తాతినేని సత్య డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, ఎమోషన్స్‌ను మేళవించి.. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు.. సీనియర్ నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
NTR : ఎన్టీఆర్ డ్రాగన్ స్టోరీ మారిందా..? నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
ఈ చిత్రం మే 8 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఇంతకీ అల్లుడెక్కడా..’ అని నరేశ్ అడుగగా..’కథలు రాసే అలవాటు ఉంది.. నాకు కథలు చెప్పకు..’ అంటూ లావణ్య చెప్పిన డైలాగ్‌లు బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా ట్రైలర్ ని రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాకు మంచి రీచ్ ఇచ్చిన రామ్ చరణ్ బావ గారికి ధన్యవాదాలు అని తెలిపింది.
