The Mummy OTT: వెన్నులో వణుకు పుట్టించే ‘ద మమ్మీ’.. ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వెన్నులో వణుకు పుట్టించే 'ద మమ్మీ(The Mummy OTT)' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అస్సలు మిస్ అవకండి.
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 08:24 PM IST
Lee Cronin The Mummy movie streaming on amazon prime
- ‘ద మమ్మీ’ కొత్త హారర్ చిత్రం.
- ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం.
- త్వరలోనే తెలుగులో అందుబాటులోకి కూడా.
The Mummy OTT: 90స్ కిడ్స్ ఆల్‌టైమ్ ఫేవరెట్ హాలీవుడ్ హారర్ మూవీస్ లిస్ట్‌లో ‘మమ్మీ’ ఫ్రాంచైజీ కచ్చితంగా ఉంటుంది. గతంలో వచ్చిన సినిమాలు అడ్వెంచర్, కామెడీ కలయికతో మెప్పించగా, దానికి భిన్నంగా సరికొత్త చిత్రం ‘ద మమ్మీ(The Mummy OTT)’ పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ గత నెల 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే భయపెట్టింది.
Sara Arjun: ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ లవ్లీ లుక్స్.. ఐస్ క్రీం తింటూ ఎంత క్యూట్‌గా ఉందో!
ప్రస్తుతం ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. త్వరలోనే ఇది ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన ఒక చిన్నారి తిరిగి తన కుటుంబం చెంతకు చేరడం, ఆ తర్వాత ఆమెలోని రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా పీడించాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని భయానక హారర్ సీన్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు సరికొత్త హారర్ అనుభూతిని ఇస్తాయని ఓటీటీ లవర్స్ టాక్.
