Singeetham Srinivasa Rao : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) కన్నుమూశారు.
- Thota Vamshi Kumar
- Updated on- October 4, 2026 / 07:52 AM IST
Singeetham Srinivasa Rao, Singeetham Srinivasa Rao passed away
Singeetham Srinivasa Rao : టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే హలీవుడ్ చిత్రాలపై మక్కువ పెంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ వంటి చిత్రాలకు పనిచేశారు. 1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు.
Anchor Manjusha : నలుపు చీర, కళ్లద్దాలు.. యాంకర్ మంజూష క్యూట్ ఫోటోలు..
తన సుదీర్ఘ కెరీర్‌లో తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 60కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ‘మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మేడమ్’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
అప్పట్లో ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ‘పుష్పక విమానం’లో సంభాషణలు లేకుండా కథను నడిపించడం, ‘ఆదిత్య 369’లో టైమ్ ట్రావెల్ వంటివి ఆయన ప్రతిభకు నిదర్శం.
ఇక 94 ఏళ్ల వయసులోనూ ఆయన ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా కావడం గమనార్హం.
ఇక ఆయన కెరీర్‌లో రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.
