Major: మేజర్ నుంచి ప్రేమ గీతం.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజికల్!
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
- Naresh Mannam
- Published On : January 7, 2022 / 06:02 PM IST
Major
Major: మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. సోని పిక్చర్స్ ఫిల్మ్స్, మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, a+s మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Bangarraju: సంక్రాంతికి వచ్చేస్తున్న సోగ్గాళ్లు.. అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఆశలు!
తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రేమ గీతాన్ని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. హృదయమా అనే ఈ పాటను ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ విడుదల చేయగా, మలయాళ భాషలో దుల్కర్ సల్మాన్ పాటను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రేమికులకు తెగ నచ్చేస్తుంది.
Shraddha Das: శ్రద్దా చిల్లవుట్.. కుర్రాళ్ళకి గ్లామర్ ట్రీట్!
ఈ మధ్య కాలంలో సిద్ పాట లేకుండా సినిమా హిట్ కావడం కష్టమే అనేలా మారిపోయింది పరిస్థితి. కొంత అరవం కొంత తెలుగు కలగలిసి పాడే పాటలకు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. అందుకే ప్రేక్షకుల మనోభావాన్ని అర్ధం చేసుకొని మేకర్స్ కూడా సిద్ శ్రీరామ్ లేకుండా యూత్ ఫుల్ సినిమాకు సిద్ధపడడం లేదు. ఇప్పటికే విడుదలయ్యే ప్రతి సినిమాలో సిద్ శ్రీరామ్ పాట ఉండడం.. ప్రతి హిట్ కావడం జరిగిపోతుండగా.. మేజర్ నుండి హృదయమా పాట కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
A song I personally love! Here's #Hrudayama from @MajorTheFilm https://t.co/nWA1e9y0Ta@AdiviSesh @sidsriram @saieemmanjrekar #SobhitaDhulipala @SashiTikka #SriCharanPakala @kk_lyricist #VnvRamesh pic.twitter.com/higwa2BJbw
— Mahesh Babu (@urstrulyMahesh) January 7, 2022
