Horror : డార్క్‌, డేంజ‌ర‌స్ హార‌ర్ థ్రిల్ల‌ర్.. ప్రీలుక్ పోస్ట‌ర్‌

హారర్(Horror), మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠకు గురిచేసే మరో మూవీ త్వరలో రాబోతుంది.

M3 media maha movies horror thriller movie production 4 pre look poster

Horror : హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠకు గురిచేసే మరో మూవీ త్వరలో రాబోతుంది. “Inspired by True Events” అనే ట్యాగ్‌లైన్‌తో నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. M3 Media, Maha Movies బ్యాన‌ర్ల‌పై మహర్షి కూండ్ల స‌మ‌ర్ప‌ణ‌లో మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Production No. 4 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్‌‌ను విడుద‌ల చేశారు. పోస్టర్‌లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి.

Varanasi : మ‌హేష్‌బాబు వారణాసి మూవీ రిలీజ్ పోస్ట్‎పోన్ కానుందా?

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో జేడీ చ‌క్ర‌వ‌ర్తి కూడా న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. హిందీ, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ యూనిట్ వెల్ల‌డించింది.