Maa Ramudu Andarivadu : ‘మా రాముడు అందరివాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సెప్టెంబర్ 4 విడుదల..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Maa Ramudu Andarivadu)

  • Published on- September 2, 2026 / 03:38 PM IST

Maa Ramudu Andarivadu

Maa Ramudu Andarivadu : అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాణంలో యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మా రాముడు అందరివాడు’. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించగా సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా కనిపిస్తాను. నిర్మాత లక్ష్మణ్ విలన్‌గా కూడా నటించారు. ఈ సినిమాలో ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి అని తెలిపారు.

Also See : Jabardasth Satya Sri : జబర్దస్త్ నటి సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ పుట్టిన రోజు.. ఫొటోలు షేర్ చేసి..

నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు. దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ.. దాదాపు పద్నాలుగు నెలలు ఈ సినిమాతో జర్నీ చేశాం. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా హీరోయిన్ మాకు సహకరించారు. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. ఈ సినిమాలో చాలా దమ్ము ఉంది. ఇప్పటికి నేను పదమూడు సినిమాలు చేశాను, వంద సినిమాలు చేయాలనేది నా టార్గెట్ అని అన్నారు.