Maa Ramudu Andarivadu : ‘మా రాముడు అందరివాడు’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..
ఈ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. (Maa Ramudu Andarivadu)
- Saketh U
- Published on- August 24, 2026 / 10:02 AM IST
Maa Ramudu Andarivadu
Maa Ramudu Andarivadu : అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాణంలో యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మా రాముడు అందరివాడు’. ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది.
మా రాముడు అందరివాడు సినిమా సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీరాములు, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, అప్పారావు, సమ్మెట గాంధీ, గడ్డం నవీన్, ఆనంద్ భారతి, చిట్టి బాబు, గోల్డ్ రెడ్డి, బేబీ గనిష్క.. పలువురు కీలక పరాల్లో నటించారు.
Also Read : Nainisha : ప్రదీప్ టాటూ వేయించుకొని.. స్టేజిపై ఇష్టం అని చెప్పి.. ఏడ్చేసిన సీరియల్ నటి..
ఆంజనేయస్వామి ప్రకృతి అనే అమ్మాయికి కథలు చెబుతుంటారు. అందులో భాగంగానే రాముడు అనే వ్యక్తి కథ చెప్తారు. సొంత ఊరిని వదిలేసి రాముడు అడవుల్లోకి జీవనం కొనసాగిస్తుంటారు. ఊర్లో హాస్పిటల్ కట్టించాలని రాముడి తండ్రి జీవితాంతం పోరాడుతూనే ఉంటాడు. రాముడు తన తండ్రి ఆశయాన్ని గుర్తించి, తన తప్పుని తెలుసుకుని ఊరికి తిరిగి వస్తాడా? ఊర్లోని చెడుని రాముడు నిర్ములిస్తాడా.. దేవుడు మనిషి కథ చెప్పడం అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రకు తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. హనుమంతుడు గ్రాఫిక్ సీన్స్ చాలా బాగా వచ్చాయని సమాచారం.
