Nainisha-Pradeep Machiraju: ప్రదీప్ టాటూ వేయించుకొని.. స్టేజిపై ఇష్టం అని చెప్పి.. ఏడ్చేసిన సీరియల్ నటి..
తాజాగా ప్రదీప్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి కంపెనీ డ్రామా షోకి హాజరైంది. (Nainisha)
Serial Actress Nainisha Propose To Anchor Pradeep
Nainisha : యాంకర్ ప్రదీప్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ప్రదీప్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సీరియల్ నటి నైనిష తనంటే ఇష్టం అని చెప్పి ఎమోషనల్ అయింది.
నైనిష వంటలక్క, బ్రహ్మముడి, ఇంటిగుట్టు.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ప్రదీప్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి కంపెనీ డ్రామా షోకి హాజరైంది.
Also Read – Rajisha Vijayan : ఓనం పండగ వచ్చేస్తుంది.. అప్పుడే స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మలయాళీ నటి..
ఈ షోలో నైనిష మాట్లాడుతూ.. నాకు 13 ఏళ్ళ క్రితం నుంచి ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. ఇప్పటివరకు ఆ అబ్బాయికి చెప్పలేదు. తనని మొదటిసారి చూసినప్పుడు నేను స్టూడెంట్ ని. నా చేతి మీద టాటూ ఉంది Deep అని. అందరూ దాని గురించి అడిగితే నేను ఓవర్ థింకర్ ని కాబట్టి డీప్ గా ఎక్కువగా ఆలోచిస్తా కాబట్టి డీప్ అని వేయించుకున్నా అని చెప్పేదాన్ని. కానీ అసలు దాని మీనింగ్ ప్రదీప్. ఇది జోక్ కాదు సీరియస్. ఇప్పటికి మీ ఎదురుగా నిలబడితే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. 8 ఏళ్ళ క్రితం వేయించుకున్న టాటూ ఇది. నేను మీకు ఈ విషయం చెప్పగలనో లేదో అని అనుకున్నా. 13 ఏళ్ళ తర్వాత చెప్పాను అంటూ ఎమోషనల్ అయింది.
దీంతో ప్రదీప్ ఆశ్చర్యపోయి.. నన్ను ఇష్టపడుతున్న వాళ్లందరికీ, స్క్రీన్ మీద నన్ను చూడటానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఇలా లక్షల మంది చెప్పకపోయి ఉండొచ్చు. వందల మంది చెప్పి ఉండొచ్చు. అందరికి ధన్యవాదాలు. మీ ప్రేమకు థ్యాంక్స్ అని తెలిపాడు. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్ చెప్పాడు ప్రదీప్.

