Karthi- Kalyan Shankar: ‘మ్యాడ్’ డైరెక్టర్‌తో తమిళ స్టార్ కార్తి.. సితార బ్యానర్‌లో భారీ క్రేజీ ప్రాజెక్ట్

మ్యాడ్ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన నెక్స్ట్ సినిమాను తమిళ స్టార్ కార్తీ(Karthi- Kalyan Shankar)తో ప్లాన్ చేస్తున్నాడు.

Mad fame Kalyan Shankar is doing his next movie with Karthi.

  • కార్తి, కళ్యాణ్ శంకర్ క్రేజీ కాంబో.
  • హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఎంపిక.
  • సితార బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్.

Karthi- Kalyan Shankar: టాలీవుడ్‌లో ‘మ్యాడ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, యువతను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఆ తరువాత మ్యాడ్ స్క్వైర్ చేసి మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు, ఈ దర్శకుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తన తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించిన ఈ దర్శకుడు, ఈసారి కోలీవుడ్ స్టార్ హీరో కార్తితో జతకట్టబోతుండటం విశేషం. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందనున్న ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తోనే ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Shivani Nagaram: చీరకట్టులో ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ.. శివాని నగరం గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా

ఈ సినిమాలో కార్తి(Karthi- Kalyan Shankar) సరసన టాలీవుడ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆమె, ఈ ప్రాజెక్ట్‌తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్వాలిటీ మేకింగ్‌కు మారుపేరుగా నిలిచే సితార సంస్థ, ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించేందుకు ఫిక్స్ అయ్యారు.

ఇక్కడ మరో విశేషమేమిటంటే, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఆయన మార్క్ మాస్ బీట్స్, మెలోడీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కామెడీ టైమింగ్‌లో తనదైన ముద్ర వేసిన కళ్యాణ్ శంకర్, కార్తిలోని ఎనర్జీని పూర్తిస్థాయిలో వాడుకుంటూ ఒక వినూత్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.