GDN : జి.డి.నాయుడు బయోపిక్.. మాధవన్ మెయిన్ లీడ్ లో.. రేపే రిలీజ్..

మాధవన్‌ ఇప్పుడు మరో బయోపిక్ తో రాబోతున్నాడు. (GDN)

  • Published on- August 6, 2026 / 01:39 PM IST

GDN

GDN : సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త కొత్త పాత్రలు, బయోపిక్స్ చేస్తూ దూసుకెళ్తున్న మాధవన్‌ ఇప్పుడు మరో బయోపిక్ తో రాబోతున్నాడు. కృష్ణకుమార్‌ రామకుమార్‌ దర్శకత్వంలో ‘జి.డి.నాయుడు’ (GDN) బయోపిక్ తెరకెక్కుతుంది. ఎడిసన్ ఆఫ్ ఇండియా, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్ అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పలు ఆవిష్కరణల ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్‌) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

జి.డి. నాయుడు పాత్రలో ఆర్‌. మాధవన్ నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రేపు ఆగస్ట్‌ 7న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తమిళ్ లో ఈ సినిమాని తెరకెక్కించగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Mahesh Babu : షర్ట్ లేకుండా మహేష్ బాబు.. వారణాసి నుంచి మహేష్ బర్త్ డే స్పెషల్ అదేనా?

గతంలో నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రి’ లో నటించి మెప్పించిన మాధవన్ ఈ సినిమా కోసం చేసుకున్న మేకోవర్, డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం, పీరియాడికల్ సెటప్ GDN సినిమాపై అంచనాలను నెలకొల్పాయి. భారతీయ సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిన, జనాలు మర్చిపోయిన ఓ మహా వ్యక్తి కథను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు.

వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్, మీడియామాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.