×
Ad

Madhavan : ఏకంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్, మోదీలతో సెల్ఫీ తీసుకున్న మాధవన్.. మోదీ ఫ్రాన్స్ టూర్‌లో మాధవన్ స్పెషల్ అట్రాక్షన్..

తాజాగా మాధవన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం మాధవన్ ఫ్రాన్స్ లో ఉన్నారు. ఇటీవల మన ప్రధాని మోదీ ఫ్రాన్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా చివరి రోజు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ మోదీతో పాటు ఫ్రాన్స్ లో ఉన్న పలువురు భారత ప్రముఖులకు కూడా విందు ఏర్పాటు చేశారు.

  • Published On : July 16, 2023 / 08:00 PM IST

Madhavan posted selfie with France President Macron and PM Modi Photos goes viral

Madhavan :  సఖి, యువ, చెలి.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మాధవన్. తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మాధవన్ సినిమా షూట్స్ ఉంటే ఇండియాలో ఉంటున్నాడు లేదా దుబాయ్ లో ఉంటున్నాడు. తన కొడుకు స్విమ్మింగ్ లో జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఒలంపిక్స్ టార్గెట్ గా దుబాయ్ లో కోచింగ్ తీసుకుంటుండటంతో మాధవన్ కూడా ఫ్యామిలీతో అక్కడికి షిఫ్ట్ అయ్యాడు.

తాజాగా మాధవన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం మాధవన్ ఫ్రాన్స్ లో ఉన్నారు. ఇటీవల మన ప్రధాని మోదీ ఫ్రాన్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా చివరి రోజు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ మోదీతో పాటు ఫ్రాన్స్ లో ఉన్న పలువురు భారత ప్రముఖులకు కూడా విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందుకి మాధవన్ కి కూడా ఆహ్వానం అందింది. దీంతో మాధవన్ ఆ కార్యక్రమానికి వెళ్లి మోదీని, మెక్రాన్ ని కలిశారు. వారితో ఫొటోలు దిగారు. ఇక మోదీ, మెక్రాన్ లతో కలిసి సెల్ఫీ కూడా తీసుకోవడం, ఆ సెల్ఫీ స్వయంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ తీయడం విశేషం. మాధవన్ ఈ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఏకంగా ఇద్దరు దేశాధినేతలతో సెల్ఫీ తీసుకోవడంతో మాధవన్ ఇప్పుడు వైరల్ అవుతున్నారు.

Bhanushree Mehra : అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను.. డైరెక్ట్‌గా ట్విట్టర్ లోనే అవకాశాలు ఇవ్వండి అంటూ హీరోయిన్ పోస్ట్..

ఇక ఈ ఫోటోలను మాధవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇండో – ఫ్రెంచ్ బంధం, ఇరు దేశ ప్రజలకు మేలు చేయాలనే తపన, ఆసక్తి ఈ వేడుకల్లో నాకు కనిపించింది. మన ప్రధాని మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ ఏర్పాటు చేసిన విందుని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో స్నేహపూర్వక వాతావరణం ఉండేలా ఆత్మ విజన్ ని తెలియచేసారు ఈ నాయకులు. వారు కోరుకున్న మంచి అంతా జరగాలని నేను ప్రార్ధిస్తున్నాను. మెక్రాన్ మా కోసం తీసిన సెల్ఫీ నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది అంటూ ఆ వేడుకకి ఆహ్వానం పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.