Bhanushree Mehra : అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను.. డైరెక్ట్‌గా ట్విట్టర్ లోనే అవకాశాలు ఇవ్వండి అంటూ హీరోయిన్ పోస్ట్..

అవకాశాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూస్తూనే ఉంది భానుశ్రీ. తాజాగా ఏమనుకుందో ఏమో ఒక డెసిషన్ తీసుకున్నట్టు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది.

Bhanushree Mehra : అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను.. డైరెక్ట్‌గా ట్విట్టర్ లోనే అవకాశాలు ఇవ్వండి అంటూ హీరోయిన్ పోస్ట్..

Varudu Movie Heroine Bhanushree Mehra asking roles from twitter post a viral tweet

Updated On : July 16, 2023 / 4:49 PM IST

Bhanushree Mehra :  వరుడు(Varudu) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) సరసన తెలుగులో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ భానుశ్రీ మెహ్రా. ఈ సినిమాకి హీరోయిన్ కి చాలా హైప్ ఇచ్చినా సినిమా ఫ్లాప్ అవ్వడంతో భానుశ్రీ ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని తమిళ్, తెలుగు, పంజాబీ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడంటూ ట్వీట్ చేసి ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో బన్నీ అభిమానులు భానుపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ అన్ బ్లాక్ చేశాడని ట్వీట్ చేసింది.

అవకాశాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూస్తూనే ఉంది భానుశ్రీ. తాజాగా ఏమనుకుందో ఏమో ఒక డెసిషన్ తీసుకున్నట్టు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. తన ఫోటోని షేర్ చేస్తూ.. ఇప్పుడు నిజం మాట్లాడే సమయం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కోసం కొత్త కంటెంట్ సృష్టించడానికి ప్రయాణించబోతున్నాను, ట్రావెలింగ్ చేసి కొత్త ప్రదేశాలని అన్వేషించబోతున్నాను. నటన అనేది నా ఫ్యాషన్. సినిమా సెట్స్ లో ఉండటం నేను మిస్ అవుతున్నాను. కొన్ని మంచి సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది.

Jagapathi Babu : ‘సలార్’ సినిమాపై జగపతిబాబు కామెంట్స్.. ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక్క సీన్ కూడా లేదంట

దీంతో భానుశ్రీకి సినిమా అవకాశాలు లేకపోవడంతో ట్రావెలింగ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఇలా ట్విట్టర్ లోనే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అడిగేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక భానుశ్రీ 2019లో కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.