Tamannaah Bhatia: నటి తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.1 కోటి నష్టపరిహారం దావా కొట్టివేత
'పవర్ సోప్స్' వివాదంతో తమన్నా(Tamannaah Bhatia) వేసిన రూ.1 కోటి నష్టపరిహారం దావాను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు.
- V Santhosh Kumar
- Updated on- April 16, 2026 / 06:33 PM IST
Madras High Court dismisses Tamannaah Bhatia plea for one crore damages from Power Soaps
- దశాబ్ద కాలం నాటి కేసులో తమన్నాకు షాక్
- పవర్ సోప్స్ వివాదంలో ఆధారాలు లేవని తేల్చేసిన ధర్మాసనం
- తమన్నా సుదీర్ఘ న్యాయపోరాటానికి తెర
Tamannaah Bhatia: మద్రాస్ హైకోర్టులో సినీ నటి తమన్నా భాటియాకు చుక్కెదురైంది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం ముగిసిన తర్వాత కూడా తన ఫోటోలను వాడుకున్నందుకు ‘పవర్ సోప్స్’ సంస్థ నుండి రూ. 1 కోటి నష్టపరిహారం కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 2011లో ఆమె దాఖలు చేసిన ఈ సివిల్ సూట్‌ను గతంలో సింగిల్ జడ్జి తిరస్కరించగా, దానిని సవాలు చేస్తూ 2018లో తమన్నా అప్పీల్‌కు వెళ్లారు. తాజాగా ఏప్రిల్ 16, 2026న విచారణ జరిపిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Hebah Patel: ఎద అందాలతో సెగలు రేపుతున్న హెబ్బా పటేల్.. నెట్టింట ఫొటోలు వైరల్
నిజానికి, ఈ వివాదం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో పవర్ సోప్స్ సంస్థతో ఏడాది కాలానికి తమన్నా(Tamannaah Bhatia) ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 2009లో ఒప్పందం ముగిసినా, తన అనుమతి లేకుండా ప్రకటనలు కొనసాగించారని ఆమె ఆరోపించారు. విప్రో వంటి ఇతర సంస్థలతో చర్చలు జరుపుతున్న సమయంలో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, తన పాపులారిటీని అక్రమంగా వాడుకున్నందుకు పరిహారం ఇవ్వాలని ఆమె వాదించారు. అయితే, ఆ సమయంలో ఆమెకు అంత పాపులారిటీ లేదని, ఒప్పందం కోసం కేవలం రూ.1 లక్ష మాత్రమే చెల్లించామని సదరు సంస్థ కోర్టుకు తెలిపింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తమన్నా తన వాదనకు సంబంధించి బలమైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఆమె సమర్పించిన సాక్ష్యాలు నమ్మదగినవిగా లేవని, అందుకే ఆమె కోరిన నష్టపరిహారం ఇవ్వలేమని జస్టిస్ రవీంద్రన్ గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. దీంతో దాదాపు దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న ఈ న్యాయపోరాటం తమన్నాకు వ్యతిరేకంగా ముగిసింది. కోర్టు ఖర్చులతో సహా ఈ అప్పీల్‌ను న్యాయమూర్తులు తోసిపుచ్చారు.
