నీ గీతం ఇవాళ ఎందుకు మూగ‌బోయింది? బాలుకి రాజా స్మృతి గీతం..

  • Publish Date - September 26, 2020 / 03:47 PM IST

Ilaiyaraaja Tribute song for SPB: దివి కేగిన దిగ్గజం.. గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఆయన స్నేహితుడు ఘన నివాళి అర్పించారు. బాలుకి, మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాకు మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌ను విడిచిపెట్టి అనంతలోకాలకు వెళ్లిపోయిన స్నేహితుడు బాలు కోసం, ఇళ‌య‌రాజా ఓ స్మృతి గీతాన్ని త‌యారు చేసి ఆయ‌న‌కు అంకిత‌మిచ్చారు.




‘‘గాన గంధ‌ర్వుడా… గండు కోయిలా…
నీ గీతం ఇవాళ ఎందుకు మూగ‌బోయింది?
గాన గంధ‌ర్వుడా… గండు కోయిలా…
నీ గీతం ఇవాళ ఎందుకు మూగ‌బోయింది?
ఒక్క‌టేగా ఆయుష్షు .. ఇవాళ శాంతించిందా?
శాంతించిందా?
పాడి పాడి.. ప్రేమ‌ను పెంచాడు…
పొగిడి పొగిడి… దేవుళ్ల‌ను స్తుతించాడు…
సంగీతమ‌నే గ‌గ‌నం… హ‌ద్దుల్ని కొలిచాడు
ఉన్న ప్రాణాన్నంతా పాట‌కే ఖ‌ర్చుచేశాడు…

యుగాలెన్నిటినో దాటి… నీ ప్రాణ స‌వ్వ‌డి
వాయు మండ‌లంలో జీవంతోనే ఉన్నా…
కంటి ముందు నిన్ను చూసుకునే వ‌రం దొరుకుతుందా…
మ‌ళ్లీ ఓ వ‌రం అందుతుందా….
అంజ‌లి… అంజ‌లి….
గాన జాబిలికి మౌన అంజ‌లి…
అంజ‌లి… అంజ‌లి….
గాన జాబిలికి మౌన అంజ‌లి’’…