Magadheera Re Release : చరణ్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అల్లు అరవింద్.. మగధీర రీ రిలీజ్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో చరణ్ అభిమానులు 'మగధీర' రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
- gum 95921
- Published On : January 28, 2023 / 04:45 PM IST
Magadheera Re release
Magadheera Re Release : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘RRR’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్ స్కిల్స్ చూసి హాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోతున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో చరణ్ అభిమానులు ‘మగధీర’ రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజు మగధీర రీ రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Ram Charan : నా భార్య ముందే నన్ను తిట్టారు.. దానికి ఉపాసన ఫీల్ అయ్యింది.. రామ్‌చరణ్!
ఇటీవల జల్సా రీ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ ఇప్పుడు మగధీర సినిమాతో మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన గీతా ఆర్ట్స్ నుంచి రిలీజ్ కాలేదు. కాగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. చరణ్ రెండో చిత్రంగా వచ్చిన ఈ సినిమా రాజమౌళికి కూడా ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచే రాజమౌళి సినీ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. 2009 లోనే అల్లు అరవింద్ ఈ సినిమాకి దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేశాడు. ఆ సమయంలో ఒక సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టాలి అంటే ఎంతో ధైర్యం కావాలి.
అల్లు అరవింద్ ఆ సాహసం చేసి ప్రతిఫలంగా 3 రేట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని సాధించాడు. ఫాంటసీ యాక్షన్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమాలో చరణ్ వారియర్ పాత్రలో కనిపించాడు. రెండో సినిమాతోనే మంచి నటుడిగా అందరి చేత మార్కులు కొట్టేశాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ ని చూసిన ప్రేక్షకులు యువరాణి అంటే ఇలానే ఉంటుంది అనేలా ముద్ర వేసింది. సినిమాలోని గ్రాఫిస్, సెట్స్, యాక్షన్ సన్నివేశాలు, అన్నిటికి కంటే కీరవాణి ఇచ్చిన సంగీతం సినిమాని బ్లాక్ బస్టర్ హిట్టుని చేశాయి.
