Mahesh Babu : థ్యాంక్యూ గుంటూరు.. మహేష్, నమ్రత ఎమోషనల్ పోస్టులు..
తాజాగా నిన్నటి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ సోషల్ మీడియాల్లో స్పెషల్ పోస్టులు పెట్టారు.
- Saketh U
- Published On : January 10, 2024 / 12:22 PM IST
Mahesh Babu and Namrata Shirodkar shares emotional posts on Guntur Kaaram Pre Release event
Mahesh Babu : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేకమంది ప్రజలు వచ్చారు.
ఇక ఈ ఈవెంట్లో మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడిన తర్వాత, ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ఇప్పుడు నాకు అమ్మ, నాన్న ఇద్దరూ లేరు, నాకు మీరే అన్ని అంటూ అభిమానులకు చేతులెత్తి దండం పెట్టి ఎమోషనల్ అయ్యారు. తాజాగా నిన్నటి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ సోషల్ మీడియాల్లో స్పెషల్ పోస్టులు పెట్టారు.
మహేష్ అభిమానుల వైపు మాట్లాడుతున్న ఫొటోని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ గుంటూరు. నా హోమ్ టౌన్ లో నా సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం, మీరందించిన ఈ ప్రేమ, ఈ జ్ఞాపకాలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. లవ్ యు ఆల్. నా సూపర్ ఫ్యాన్స్ అందర్నీ త్వరలో మళ్ళీ కలుస్తాను. సంక్రాంతి మొదలైంది. ముఖ్యంగా గుంటూరు పోలీసులకు, వారు ఇచ్చిన సపోర్ట్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.
Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ‘మావా ఎంతైనా..’ విన్నారా?
ఇక మహేష్ భార్య నమ్రత(Namrata Shirodkar) ఈవెంట్ కి సంబంధిచిన ఓ వీడియోని షేర్ చేసి.. మహేష్ బాబు తన అభిమానుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మాట్లాడటానికి నేనే చివరి వ్యక్తిని కావొచ్చు. ఎల్లప్పుడూ రెండు రాష్ట్రాల్లోని ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు మహేష్ పట్ల ప్రేమ చూపిస్తుంటారు. మహేష్ చేసే అన్ని ప్రయత్నాలలోను అభిమానులు మద్దతుగా ఉండి అతన్ని సినిమాల కోసం ఇంకా కష్టపడేలా చేస్తారు. కానీ ఇవాళ గుంటూరులో మహేష్ కి, అతని టీంకి మీరిచ్చిన ఆదరణ చూసిన తర్వాత గర్వంగా చెప్పగలను మహేష్ బాబు అభిమానులకు ఒక ఎమోషన్. ఈ అభిమానం, ప్రేమ మీ కుటుంబ సభ్యులుగా మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మేము మా ప్రేమని మీకు అన్ని మార్గాల్లోనూ అందిస్తాము. మీరు కూడా మా ప్రేమని స్వీకరిస్తారు అని భావిస్తున్నాను. మహేష్ ని ఇంతగా ప్రేమించే మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పోస్ట్ చేశారు. దీంతో మహేష్, నమ్రత సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారాయి.
