Mahesh babu : ఫస్ట్ టైం మా ఆవిడతో ఇలా రావడం.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..

హైదరాబాద్ లో 'గౌరీ సిగ్నేచర్స్' బ్రాంచ్ ఓపెనింగ్ లో పాల్గొన్న మహేష్ బాబు..

Mahesh babu comments about Namrata Shirodkar at shop opening

Mahesh babu : టాలీవుడ్ సూపర్ కపుల్ మహేష్ బాబు, నమ్రతా.. కొత్త బిజినెస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ తో ఇండస్ట్రీలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. తాజాగా ఈ కపుల్ ‘గౌరీ సిగ్నేచర్స్’ అనే సంస్థకి సైన్ చేశారు. తాజాగా ఈ బ్రాండ్ కి సంబంధించిన ఒక బ్రాంచ్ హైదరాబాద్ లో ఓపెన్ అయ్యింది. ఇక ఓపెనింగ్ కార్యక్రమంలో మహేష్ బాబు, నమ్రతా పాల్గొన్నారు. ఈ ఓపెనింగ్ తరువాత వీరిద్దరూ ప్రెస్ మీట్ లో పాల్గొని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వచ్చారు. ఈక్రమంలోనే మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింటి వైరల్ గా మారాయి.

మహేష్ మాట్లాడుతూ.. “ఫస్ట్ టైం మా ఆవిడతో కలిసి ఇలా ప్రెస్ మీట్ కి రావడం. ఇది చాలా ఆనందంగా ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే నమ్రతాకి ఒక బహుమతి ఇవ్వాలి అంటుకుంటే ఏం ఇస్తారని ప్రశ్నించగా, మహేష్ బాబు బదులిస్తూ.. “తను మొత్తం షాప్ కావాలంటుంది” అంటూ చెప్పడంతో అందరు నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Rajasekhar : రామ్‌చరణ్ సినిమాలో మిస్ అయ్యింది.. ఇప్పుడు నితిన్ సినిమాలో చేస్తున్నాడా..?

కాగా మహేష్ తాజాగా ఒక మ్యాగజైన్ కోసం స్టైలిష్ ఫోటోషూట్ చేశాడు. ఆ పిక్స్ లో మహేష్ బాబు లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మహేష్ బాబుకి వయసు అవుతున్న కొద్దీ అందం పెరుగుతూనే పోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలు వైపు కూడా ఒక లుక్ వేసేయండి.