Mahesh Babu daughter Sitara Ghattamaneni distribute cycles to poor girls
Sitara Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముద్దులు కూతురు సితార సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఎంతోమంది అభిమానాన్ని అభిమానాన్ని, ఫేమ్ ని సంపాదించుకుంటుంది. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాలో రీల్స్ అంటూ మంచి ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఈ మధ్య పలు సూపర్ హిట్ సాంగ్స్ కి అదిరే స్టెప్పులు వేస్తూ అభినందనలు అందుకుంటుంది. ఇక ఇటీవల చిన్న వయసులోనే ఒక పెద్ద సంస్థకి బ్రాండ్ అంబాసడర్ గా అవకాశం అందుకుంది. PMJ జ్యువెల్లరీ సంస్థకు ఓ కమర్షియల్ యాడ్ చేసి అదరహో అనిపించింది.
Kamal Hasaan : హాలీవుడ్లో లోకనాయకుడు.. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ హాసన్.. పిక్స్ వైరల్!
ఇక ఆ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ చారిటీకి డొనేట్ చేసి అందరి మనసులు దోచుకుంది. ఇప్పుడు మరో గొప్ప పని చేసి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. 2012 జులై 20న జన్మించిన సితార.. నేడు తన 11వ పుట్టినరోజు జరుపుకుంటుంది. సెలబ్రిటీ హోదాలో ఉన్న సితార తన పుట్టినరోజుని అంగరంగా వైభవంగా జరుపుకోకుండా చాలా సింపుల్ గా, ఆలోచనాత్మకంగా జరుపుకుంది. మహేష్‌బాబు ఫౌండేషన్ లోని యువతతో కలిసి తన పుట్టినరోజు వేడుకని సితార జరుపుకుంది.
ఇక తన పుట్టినరోజు నాడు ఆ యువతకి ఎదురు గిఫ్ట్స్ ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేసింది. పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లే ఆ యువత కోసం సితార సైకిళ్లు కొనిపెట్టి ఇచ్చింది. వారందరి మధ్య కేక్ కట్ చేసిన సితార అనంతరం వారికీ ఆ సైకిళ్లను అందించింది. ఈ విషయాన్ని ఆమె తల్లి నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నీలోని ఈ ఆలోచనాత్మకతతో, అలాగే ఇతరుల పై ప్రేమ చూపించే నీ వ్యక్తిత్వంతో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలు ఎన్నో సృష్టించాలని నేను కోరుకుంటున్నాను ” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ సితార పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.