Sitara Ghattamaneni : సితార పాప బర్త్‌డే.. మహేష్ కూతురిగా వచ్చి ఇప్పుడు సింగిల్‌గా యాడ్స్.. చిన్నవయసులోనే సూపర్ ఫాలోయింగ్..

నేడు సితార పుట్టిన రోజు కావడంతో మహేష్ అభిమానులు, పలువురు నెటిజన్లు సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో సితార ట్రెండింగ్ లో ఉంది.

Sitara Ghattamaneni : సితార పాప బర్త్‌డే.. మహేష్ కూతురిగా వచ్చి ఇప్పుడు సింగిల్‌గా యాడ్స్.. చిన్నవయసులోనే సూపర్ ఫాలోయింగ్..

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Birthday Special

Updated On : July 20, 2023 / 8:20 AM IST

Sitara Ghattamaneni Birthday :  సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని అందరికి పరిచయమే. చిన్న వయసు నుంచే నమ్రత సితార ఫోటోలు షేర్ చేయడంతో అందరికి సితార బాగా తెలుసు. సితార మొదటి నుంచి కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో పలు వీడియోలతో మంచి పేరు తెచ్చుకుంది.

2012 జులై 20న సితార పుట్టింది. సితారకు కేవలం 11 ఏళ్ళే. 11 ఏళ్ళ ఏజ్ లోనే చాలా బాగా మాట్లాడటం, చాలా యాక్టివ్ గా ఉండటం, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాలో రీల్స్, ఇప్పుడు యాడ్స్.. ఇలా అన్నిటితో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. నేడు సితార పుట్టిన రోజు కావడంతో మహేష్ అభిమానులు, పలువురు నెటిజన్లు సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో సితార ట్రెండింగ్ లో ఉంది.

సితార చదువుతో పాటు అన్నిట్లోనూ తన పార్టిసిపేషన్ ఉండేలా చూసుకుంటుంది. సితార ఓ పక్క సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటుంది. మరో పక్క డ్యాన్స్ తో కూడా అలరిస్తుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాకి ఓ ప్రమోషన్ సాంగ్ లో డ్యాన్స్ వేసి అలరించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే సితార సింగిల్ గా ఓ కమర్షియల్ యాడ్ చేసింది. PMJ జ్యువెల్లరీ సంస్థకు సితార యాడ్ చేసింది. ఆ సంస్థ సితార కలెక్షన్స్ అంటూ నగల్లో స్పెషల్ కలెక్షన్స్ కూడా రిలీజ్ చేసింది. సితార కమర్షియల్ యాడ్ ఫొటోలని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద కూడా ప్రదర్శించారు. ఇక తన మొదటి రెమ్యునరేషన్ కూడా ఓ చారిటి సంస్థకు ఇచ్చి అందరి మన్ననలు పొందింది. గతంలో కూడా తన పాకెట్ మనీని మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చింది.

VD13 Movie : విజయదేవరకొండ మృణాల్ ఠాకూర్ సినిమా VD13లో మరో హీరోయిన్.. ఫుల్ స్వింగ్ లో షూటింగ్..

మహేష్ కూతురిగా అందరికి పరిచయం అయి ఇప్పుడు తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది సితార ఘట్టమనేని. త్వరలో సినిమాల్లోకి వస్తుందని, భవిషత్తులో సితార హీరోయిన్ అవుతుందని మహేష్, నమ్రత గతంలోనే ప్రకటించారు. సితార పాప ఎదుగుదల చూసి మహేష్ అభిమానులు సంతోషపడిపోతున్నారు. 11 ఏళ్ళ వయసులోనే ఇంత యాక్టివ్ గా ఉంటూ, ఇంత కష్టపడుతూ, మంచి పనులకు సపోర్ట్ చేస్తూ అందరికి మార్గదర్శకంగా నిలుస్తుంది సితార.