Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్‌ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉంది..
సితార పాప బ్రాండ్ అంబాసడర్ గా చేసిన మొదటి యాడ్ చూశారా. ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉందంటూ..
- gum 95921
- Published On : July 19, 2023 / 05:11 PM IST
Mahesh Babu daughter Sitara Ghattamaneni jewellery ad video
Sitara Ad Video : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గారాలపట్టి సితార సినిమాలో ఎంట్రీ కంటే ముందు యాడ్స్ తో అభిమానులకు పరిచయం అవుతుంది. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సితార.. చిన్న వయసులోనే బ్రాండ్ అంబాసడర్ గా ఆఫర్ ని అందుకుంది. టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు అత్యధికంగా యాడ్స్ చేస్తుంటాడు. ఇప్పుడు తెలుగులో ఏ స్టార్ కిడ్ అందుకొని ఆఫర్ ని మహేష్ కూతురు అందుకొని టాక్ అఫ్ ది టౌన్ అయ్యిపోయింది.
Project K : ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ అంటూ కామెంట్స్.. ఐరన్ మ్యాన్ సూట్‌కి ప్రభాస్ హెడ్..
ఇటీవలే ఆ జ్యువలరీ సంస్థ కోసం ఒక యాడ్ కూడా చేసింది సితార. ఇక ఆ యాడ్ కి సంబంధించిన ఫోటోలు ప్రసిద్ద అమెరికా టైమ్స్ స్క్వేర్ (New York Time Square) బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించడం మరో సంచలనం అని చెప్పాలి. తాజాగా ఈ యాడ్ వీడియోని మహేష్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ యాడ్ లో సితార చాలా నేచురల్ గా కనిపించింది. ఇక ఈ యాడ్ లో తనని ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెప్పగా, దానికి సితార.. “నేను ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని అనుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించింది.
ఇక ఈ మాటని మహేష్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే సితార హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని ఇప్పటికే నమ్రతా తెలియజేసింది. ఈ క్రమంలోనే సితార పాప ప్రిన్సెస్ కాదు ఫ్యూచర్ లో మహారాణిలా టాలీవుడ్ ని తన తండ్రిలా ఏలుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. కాగా ఈ యాడ్ కోసం సితార 1 కోటి వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మొత్తం రెమ్యూనరేషన్ కూడా ఛారిటీకి ఇచ్చేసి తన తండ్రి మహేష్ లా గొప్ప మనుసు చాటుకుంది.
