Project K : ప్రభాస్‌ ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ అంటూ కామెంట్స్.. ఐరన్ మ్యాన్ సూట్‌కి ప్రభాస్ హెడ్..

బాహుబలి వంటి సినిమా తీసిన ప్రభాస్ నుంచి ఒక గ్రాఫికల్ మూవీ వస్తుందంటే ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ప్రభాస్ మూవీస్ మేకర్స్..

Project K : ప్రభాస్‌ ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ అంటూ కామెంట్స్.. ఐరన్ మ్యాన్ సూట్‌కి ప్రభాస్ హెడ్..

Fans Comments on Prabhas First Look in Project K gone viral

Prabhas First Look : ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ స్టోరీతో చిత్రీకరణ జరుపుకుంటున్న మూవీ ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్ (Kamal Hasaan).. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ప్రీ లుక్స్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేస్తున్నారు.

Guntur Karam : గుంటూరు కారం సెట్స్ నుంచి ఫోటో లీక్.. పొలిటికల్ టచ్‌తో మూవీ..!

ఈ క్రమంలోనే దీపికా లుక్ ని ఆల్రెడీ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ప్రభాస్ లుక్ ని కూడా విడుదల చేశారు. ప్రభాస్ లుక్ కి ఇండియన్ ఇతిహాస టచ్ ఇస్తూనే మోడరన్ డ్రెస్ లో చూపించారు. లాంగ్ హెయిర్ తో జటాజూటధారిగా కనిపిస్తూనే, సూపర్ హీరో సూట్ ధరించి మోడరన్ లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఇక ఈ లుక్ చూసి ఇండియన్ సూపర్ హీరో రాబోతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఫస్ట్ లుక్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ లుక్ అఫీషియల్..? లేదా ఫ్యాన్ మేడ్..? అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Bro Movie : బ్రో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్ పెంపు లేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. పవన్ వస్తున్నాడా..?

ఫస్ట్ లుక్ లో ఐరన్ మ్యాన్ సూట్ కి ప్రభాస్ హెడ్ తీసుకొచ్చి పెట్టినట్లు ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. ఈ క్రమంలోనే ఆదిపురుష్ గ్రాఫిక్స్ ని ప్రస్తావిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఆదిపురుష్ గ్రాఫిస్స్ గుర్తుకు వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి వంటి సినిమా తీసిన ప్రభాస్ నుంచి ఒక గ్రాఫికల్ మూవీ వస్తుందంటే ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ప్రభాస్ మూవీస్ మేకర్స్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా, కేవలం ప్రభాస్ ఇమేజ్ ని అడ్డుపెట్టుకొని పూర్ VFX తో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.