Sitara-Sukriti : సుకుమార్ కూతురితో మహేష్ కూతురు.. ఫొటోస్ చూసారా..

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu daughter Sitara with Sukumar daughter Sukriti have you seen the photos

Sitara-Sukriti : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఇప్పటికే పలు బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేసింది.  సితార నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

Also Read : Kanthi Dutt : హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడు.. లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా..

తాజాగా తన తల్లి, అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి, వంశీ పైడిపల్లి కూతురు మాలినితో కలిసి ముంబైలోని ఓ ఫేమస్ పాప్ సింగర్ దువా లిపా మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లారు. అందులో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఫేమస్ పాప్ సింగర్ దువా లిపాతో దిగిన పలు ఫోటోలని షేర్ చేశారు సుకుమార్ కూతురు సుకృతి, మహేష్ కూతురు సితార. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వంశీ పైడిపల్లి కూతురు మాలిని, సితార ఇద్దరూ చిన్నపటి నుండి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి రీల్స్ కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ముంబై మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎంజాయ్ చేసారు.


ఇకపోతే సుకుమార్ కూతురు సుకృతి ఇప్పటికే చాలా మందికి తెలుసు. అలానే ఈ అమ్మాయి తన తండ్రిలాగా డైరెక్టర్ కూడా. తనకు డైరెక్షన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఈమెకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డైరెక్టర్ గా షార్ట్ ఫిలిమ్ కూడా తీసింది. ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతికి అవార్డు దక్కింది. ఇలా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది సుకృతి.