×
Ad

Mahesh Babu : ఏఎంబి సినిమాస్ యానివర్సరీలో మహేష్ ఫ్యామిలీ సందడి.. పిక్స్ చూశారా..?

ఏఎంబి సినిమాస్ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మహేష్ ఫ్యామిలీ సందడి. వైరల్ అవుతున్న పిక్స్.

  • Published On : December 3, 2023 / 09:03 PM IST

Mahesh Babu family photos in AMB Cinemas five years anniversary celebrations

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టి ఏఎంబి సినిమాస్ (AMB Cinemas) మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థాపించిన ఈ మల్టీప్లెక్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ మల్టీప్లెక్స్ స్థాపించి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో రీసెంట్ గా ఏఎంబి సినిమాస్ లో ఐదేళ్ల యానివర్సరీ జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యామిలీ సందడి చేసింది.

మహేష్ సతీమణి నమ్రతా, కొడుకు గౌతమ్‌తో ఆసియన్ నారంగ్ వారసులు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. గౌతమ్ అండ్ నారంగ్ వారసులు కలిసి ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ కేక్ ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో గౌతమ్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

గౌతమ్ హిట్ అండ్ చార్మ్‌నెస్ మహేష్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సూపర్ స్టార్ వారసుడు త్వరగా తెరంగేట్రం చేయాలని కోరుతున్నారు. అయితే గౌతమ్ ఎంట్రీకి మరో పదేళ్ల సమయం ఉందంటూ నమ్రతా ఆల్రెడీ ఇటీవల తెలియజేశారు. ప్రస్తుతం గౌతమ్ తన స్టడీస్ పై ఫోకస్ పెట్టాడు. త్వరలో పై చదువులు కోసం విదేశాలకు వెళ్లనున్నారు.

Also read : Animal Movie : యానిమల్ మూవీలోని రియల్ మెషిన్ గన్ చూశారా..?

ఇక మహేష్ గుంటూరు కారం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ మహేష్ పై ముఖ్యమైన సన్నివేశాలను, సాంగ్స్ ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఆ మూవీ సెట్స్ నుంచి మహేష్ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట లీక్ అయ్యి వైరల్ అవ్వుతుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.